మమ్మల్ని సందర్శించినప్పుడు సూచనలు

కోవిడ్ 19 దృష్టిలో, నొవెల్ కరోనా వైరస్ (nCoV) యొక్క వ్యాప్తిని ఆపడానికి, మన పరస్పర భద్రత కోసం, భౌతిక సంప్రదింపుల కోసం మీరు మమ్మల్ని సందర్శించేటప్పుడు కొన్ని మర్యాదలను అనుసరించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.

  1. ఎల్లప్పుడూ మాస్క్ ధరించండి.
  2. లోపలికి ప్రవేశించిన వెంటనే మీ చేతులను శుభ్రపరచండి. (సానిటైజర్ మా కేంద్రంలో అందుబాటులో ఉంచబడింది)
  3. దేనినీ అనవసరంగా తాకవద్దు.
  4. మీ ముఖాన్ని తాకవద్దు.
  5. మీకు, ఇతరులకు మధ్య సామాజిక దూరాన్ని పాటించండి.
  6. ముడుచుకున్న మోచేయిలోకి దగ్గండి లేదా తుమ్మండి
  7. వీలైతే కాగితం ఉపయోగించవద్దు.
  8. మీ మొబైల్‌లో ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి అందులో నమోదు చేసుకోండి.

పాండమిక్ మరియు లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా, ఈ క్రిందివి తప్పనిసరి. దయచేసి మాతో సహకరించండి

  1. రోగి మాత్రమేలో పలికి అనుమతించబడతారు.
  2. పిల్లల విషయంలో, 1 పెద్దవారిని అనుమతించబడతారు.
  3. ఫేస్ మాస్క్ తప్పనిసరి
  4. డిక్లరేషన్ తప్పనిసరిగ నింపాలి.
  5. పూర్తి చిరునామా తప్పనిసరిగ ఇవ్వాలి.
  6. ఫోటో-ఐడి మరియు చిరునామా రుజువు తప్పనిసరి.
  7. కోవిడ్ 19 స్క్రీనింగ్ ప్రశ్నకర్తని తప్పనిసరిగ మీకు తెలిసినంత వరకు నిజాలతో నింపాలి.

కరోనా వైరస్ కాగితం మరియు నగదు నుండి వ్యాప్తి చెందుతుందని డేటా సూచిస్తునందున (ఇంకా నిర్ధారణ కాలేదు), వీలైనంత వరకు కాగితం ఉపయోగించవద్దు.

  1. DocOn పేషెంట్ యాప్ను డౌన్‌లోడ్ చేయండి. మీ డిజిటల్ ప్రిస్క్రిప్షన్ల కోసం, వీడియో (ఆన్‌లైన్) సంప్రదింపులు కోసం మరియు అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకోవడానికి మెట్లాస్ ఇ.యన్.టి కేర్‌తో రిజిస్టర్డ్ అయిన మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
  2. నగదు మానుకోండి. మేము డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తాము. చెల్లించడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి. మేము కార్డు చెల్లింపులను కూడా తీసుకువస్తున్నాము.
  3. ఇ-ప్రిస్క్రిప్షన్ మరియు ఇ-బిల్స్‌ కోసం అడగండి. మీ సంప్రదింపులు పూర్తి అయిన వెంటనే మీ ప్రిస్క్రిప్షన్ మరియు బిల్లును డాక్ఆన్ పేషెంట్ యాప్‌లో తక్షణమే పొందండి. మీరు ఎక్కడికి వెళ్లినా మీ మెడికల్ ఫైల్‌ను మీతో తీసుకొని వెళ్ళవచ్చు.

తిరిగి వెళ్ళుటకు, ఇక్కడ నొక్కండి.

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close